వ్యూహం టీజర్‌ డేట్‌ చెప్పేసిన ఆర్జీవీ

-

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాంలగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ముందు ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

జూన్ 24న ఉదయం 11 గంటలకు ఈ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. ఈ సినిమా నుండి గతంలో రిలీజ్ అయినా పోస్టర్ తోనే ఆసక్తి రేపిన వర్మ ఇక టీజర్ తో ఎటువంటి సంచనలం క్రీయేట్ చేస్తాడో చూడాలి..ఈ తాజా అప్డేట్ తో RGV ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ లో జగన్ పాత్రని ‘అజ్మల్ అమీర్’ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ కనిపించబోతుంది.ఈ మూవీ ని దాసరి కిరణ్ రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version