సమ్మక్కకు విస్కీ తాగించిన RGV.. దుమారం రేపుతున్న పోస్ట్ !

-

సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ. ఇక తాజాగా మరో వివాదాస్పద పోస్ట్ చేశాడు వర్మ. తాజాగా షేర్ చేసిన ఫోటోలో సమ్మక్క ఫోటో పై పోస్టు చేశాడు.

తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ దేవతగా సమ్మక్కను అందరూ కొలుస్తారు. అలాంటి దేవతకు వర్మ విస్కీ ఆఫర్ చేస్తున్నానంటూ విస్కీ మందు చూపించాడు. అదికూడా కొండా మురళి, కొండా సురేఖ ఇంట్లో నేనంటూ… వారు కూడా చూస్తున్నారంటూ ఆ ఫోటో తీసే ఆమె కొండ మూవీ నిర్మాత అని ఇలా వర్మ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు వర్మ పై ఫైర్ అవుతున్నారు. దేవతలకు మందు తాగిన చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news