ఉక్రెయిన్‌కు శుభవార్త చెప్పిన బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌

-

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ వేళ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఉక్రెయిన్‌కు శుభవార్త చెప్పారు. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ పౌరులను, జాతీయ మౌలిక సదుపాయాలను రక్షించడంలో సహాయపడటానికి కొత్త ప్యాకేజీని అందిస్తామని అన్నారు రిషి సునాక్‌. తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌. రష్యా జరిపిన దాడిలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతును రుషి ప్రకటించారు.

Rishi Sunak pledges £50 million military aid to Ukraine as he meets  Volodymyr Zelensky... - LBC

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..సునాక్‌ ఉక్రెయిన్‌కు మొదటిసారి వెళ్లారు. అన్ని విధాలుగా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు. ఇరాన్‌ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు 125 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్నులిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ గెలిచే వరకు మద్దతిస్తామన్నారు. 50మిలియన్ల STG ప్యాకేజ్‌ లేదంటే వైమానిక రక్షణను అందిస్తామని చెప్పారు తన నాయకత్వంలోనూ ఎటువంటి మార్పు ఉండదని ఉక్రెయిన్ నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో మీవంటి స్నేహితులు మా కు అండగా ఉన్నందుకు ..మా విజయంపై తమకు గట్టి నమ్మకముందని ట్వీట్‌ చేశారు జెలెన్స్కీ.

Read more RELATED
Recommended to you

Latest news