బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తదితరులు పాల్గొంటారు. ప్రశిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులకు అవగాహన కల్పిస్తారు.
దేశంలోని తాజా రాజకీయాలు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఇందులో తెలంగాణలోని అంశాలు కూడా చర్చకు రానున్నాయి. చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ విషయంలో అనుసరించే కార్యాచరణపై చర్చించి, రాజకీయ తీర్మానం చేస్తారు. రాజకీయంగా టీఆర్‌ఎ్‌సను ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రధాన అంశంగా చర్చిస్తారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు.