చీర కట్టులో అదరగొట్టిన రీతు వర్మ

-

టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ గురించి మనందరికీ తెలిసిందే. హైదరాబాదులో పుట్టి పెరిగిన రీతు వర్మ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పేరు దక్కించుకొని టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఫ్లోరల్ చీరలో దర్శనమిచ్చిన ఈ తెలుగు బ్యూటీ.. కళ్ళు పేలిపోయే అందంతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది.

హైదరాబాద్ లో పుట్టి పెరిగినా కూడా ఈమె నార్త్ అమ్మాయి అన్నట్లుగా ఉంటుంది. కారణం ఈమె కుటుంబ మూలాలు నార్త్ లో ఉన్నాయి. అందువల్ల తన ఇంట్లో సౌత్ మరియు నార్త్ కల్చర్ మిక్స్ అయి ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా పద్ధతి అయిన పాత్రలోనే హుందా డ్రెస్సింగ్ లో కనిపించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఐతే సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ట్రెడిషనల్, స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఈమె చీర కట్టులో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news