కల్హేర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి ఎస్ఎన్ఏ 161పై చోటు చేసుకుంది. మృతుడు కామారెడ్డి జిల్లా బిచ్కుంద కు చెందిన అనిల్(21) గా గుర్తించారు. మృతుడు గత రెండు రోజులుగా బాచేపల్లిలో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.