విద్యార్థులలో ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రమాదం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ సైన్స్ ప్రయోగం విఫలమై, 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. గతిశిల కాలేజీలో సైన్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా కొందరు విద్యార్థులు రాకెట్ రూపొందించారు. ఇద్దరు విద్యార్థులు దానికి ఏదో రిపేర్ చేస్తుండగా, ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో లెక్చరర్తో పాటు 11 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జార్ఖండ్ లోని ఘట్ సిలా కాలేజీలో చోటు చేసుకుంది.
ఈ పేలుడుకు సంబంధించిన వీడియో లో విద్యార్థులు రాకెట్ మోడల్ ను సరి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అధిపేలడం చూడవచ్చు. కాగా ఆ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు రాకెట్ చుట్టూ గుమిగూడటంతో ఎక్కువ మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల పరిస్థితి విషమంగా లేదని ఆ కళాశాల ప్రొఫెసర్ తెలిపారు.