రాకింగ్​ రాకేశ్- సుజాత పెళ్లి ఫిక్స్​… ఎప్పుడంటే?

-

కామెడీ టైమింగ్​, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్​ రాకేశ్​. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్​ట్రా జబర్దస్త్​లో టీమ్​లీడర్​ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్​ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్​ టీమ్​ ద్వారా జబర్దస్త్​లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్​లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ తమ స్కిట్​లలో కడుపుబ్బా నవ్విస్తూనే లవ్​ట్రాక్​ను నడిపించారు. మొదట ఆన్​స్క్రీన్​ రొమాన్స్​గా ప్రారంభించినా.. ఆ తర్వాత నిజజీవితంలోనూ ప్రేమపక్షులుగా మారారు. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు​ తెగ ట్రెండింగ్​ అవుతున్నాయి.

రాకింగ్ రాకేష్ సుజాత
రాకింగ్ రాకేష్ సుజాత

దీంతో వీరిద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయమై ఆ జోడీ స్పందించింది. నేడు వినాయకచవితి పండుగను పురస్కరించుకుని ‘మన ఊరి దేవుడు’ అనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌ను ఈటీవీ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు జయప్రద, ప్రగతి, ఖుష్బూ, భగవాన్​, నాగినీడు, ఇంద్రజ గెస్ట్​లుగా విచ్చేసి తమ సంభాషణలతో నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే రాకేష్.. తన తమ్ముడి కుమార్తెకు పేరు పెట్టాలని అక్కడికి వచ్చిన గెస్ట్​లను కోరగా.. అందరూ కలిసి నక్షత్ర అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా రాకేష్ తల్లి.. రాకేశ్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. దీంతో అందరూ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా ‘శ్రీను అన్న చెబుతారు’ అని రాకేష్ అంటాడు. అప్పుడు ‘ఆమె ఎవరో కాదు మా బంధువు జోర్దార్​ సుజాతతో త్వరలో పెళ్లి’ అని ప్రకటిస్తాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందని చెబుతాడు.

 

అంతకముందు ఓ ఇంటర్వ్యూలో రాకేశ్​ తన ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మాది నిజమైన ప్రేమే.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తనకు జబర్దస్త్​లో చేయాలని ఆసక్తి ఉందని తెలిసి.. అప్పటికే వేరే కామెడీ షోలో చేస్తున్న తనను ఇక్కడికి తీసుకొచ్చాను. తను జబర్దస్త్​లోకి వచ్చేటప్పటికే బాగా ఫేమస్​. ఇక్కడ కలిసి పనిచేస్తున్న క్రమంలో మా బంధం బలపడింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తను అర్థం చేసుకోలదు. అంతకుమించిన అదృష్టం మరోటి లేదు. మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు తీసుకోకపోతే మళ్లీ రాదని నా అభిప్రాయం.” అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news