బాలయ్యకు సినిమా అంటే క్రేజ్. కెమెరా ముందు ఆయన ఎంతో హుందాగా ఉంటారు. నటనకు ప్రాణం పెడతారు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తారు. షూట్ అవుతుందనగా.. కథలో మార్పులు చెప్పరు గాక చెప్పరు. దటీజ్ బాలయ్య.బాలయ్య అంటే కృష్ణ దేవరాయులు.. బాలయ్య అంటే సమర సింహా రెడ్డి.. బాలయ్య అంటే నరసింహ నాయుడు..బాలయ్య అంటే తిరుగులేని తేజం. సీమ కథలకు ప్రాణం పోసిన నటుడు. డైలాగ్ లు పలికితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించగలిగే నటుడు.
అంతో ఇంతో తన వరకూ ఇతరులను బాధపెట్టడం ఇష్టం ఉండని వ్యక్తి. రాజకీయంలో కూడా ఎంత వరకో అంత వరకే ! తోటి నటులను ప్రోత్సహిస్తారు. నవ్వులు చిందిస్తూ నానీ.. మీ సినిమా చూశాను బాగుందయ్యా అని కుర్ర హీరోకు కాంప్లిమెంట్లు ఇచ్చి పంపేంత మంచి మనసు.
బాలయ్య ఇప్పుడు అన్ స్టాపబుల్. తిరుగులేని క్రేజ్-తో ఆయన దూసుకుపోతున్నారు. సింహా, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలూ ఆయనకు హ్యాట్రిక్ విజయాలను అందించాయి. బోయపాటి లాంటి డైరెక్టర్లకు బాలయ్య పల్స్ తెలుసు. ఆయన ఫ్యాన్స్ పల్స్ తెలుసు. కనుక హై ఇంటెన్సిటీ ఉన్న సీన్స్ తీస్తారు. అవే సినిమాకు హైలెట్ అవుతాయి. నేను ఆడియన్-ను ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్నాను కనుక అదే ఫిక్స్..మిగిలినవి నాకు తెలియదు.. ఫైట్స్ చేసినా, డ్యాన్స్ చేసినా, నా అభిమానుల కోసం రిస్క్ చేసినా అవన్నీ సినిమాలో భాగమే! సినిమా నాకో దైవం అని చెబుతారాయన. బర్త్డే సందర్భంగా ఇదిగో కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. ఇంకా టైటిల్ కన్ఫం కాలేదు. ఈ సినిమాను గోపిచంద్ మలినేని రూపొందిస్తున్నారు. టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి అనే కుర్ర డైరెక్టర్ తో ఆయన బ్రో ఐ డోంట్ కేర్ అనే సినిమా చేయనున్నారు. వీటి తరువాత తన కుమారుడు మోక్షు ఎంట్రీ ఉంటుంది. ఇక బాలయ్య దేవాలయం బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలు కూడా ఎప్పటిలానే కొనసాగుతాయి. ఆయన ఏటా ఈ సంస్థను అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. త్వరలో విజయవాడలో కూడా అమ్మనాన్నల పేరిట క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే అనుకుంటున్నారు.
డియర్ బాలయ్య ఆల్ ద బెస్ట్ . మీరు అరిస్తే శబ్దం కాదు శాసనమే !