ROWDY BOYS TRAILER : ఎన్టీఆర్ చేతుల మీదుగా “రౌడీ బాయ్స్” ట్రైలర్

-

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న తాజా సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బిగ్గెస్ట్ నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. హీరో అశిష్ దిల్ రాజు కుటుంబానికి దగ్గరి బంధువు. అందుకే ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు అందరినీ అలరించాయి. ఇక తాజాగా మరో బిగ్ అప్డేట్ ను వదిలింది చిత్రబృందం. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హీరో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ బాండింగ్ చాలా అద్భుతంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాలేజీ లైఫ్ అలాగే పల్లెటూరులో కొన్ని సన్నివేశాలు ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా రౌడీ బాయ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version