RRR: వాహ్..అదరగొట్టిన బుడ్డోళ్లు..‘కొమురం భీముడో’ సాంగ్ రీక్రియేషన్‌లో అద్భుతమైన హావభావాలు

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో ‘కొమురం భీముడో’ సాంగ్ హైలైట్ అయింది. చిత్రానికి ఈ పాట ఆయువు పట్టని చెప్పొచ్చు. ఇక ఈ పిక్చర్ లో రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ ఉన్నప్పటికీ తారక్ పాత్ర ఒకే రకంగా బిహేవ్ చేస్తోంది. కాగా, ఒకే ఒక పాటతో జూనియర్ ఎన్టీఆర్ తనలోని నట విశ్వరూపం చూపారని సినీ అభిమానులు అంటున్నారు.

మూడు నిమిషాల పాటలోనే తన నటనా ప్రతిభను తారక్ చక్కగా వెండితెరపైన ఆవిష్కరించారని అంటున్నారు. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ లో తారక్ ను మించిన వారు లేరు అనే విధంగా సినిమాలో ఆయన ప్రదర్శన ఉంది. అమాయక పాత్రతో పాటు ఎమోషనల్ పర్సన్ గా తారక్ , పవర్ ఫుల్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ ‘కొమురం భీముడో’ సాంగ్ లో కనిపిస్తారు.

ఆ పాటలో మాదిరిగా బుడ్డోళ్లు పర్ఫార్మ్ చేశారండోయ్.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రామ్ చరణ్ మాదిరిగా రెడ్ డ్రెస్ లో కొరడా పట్టుకుని ఝుళిపిస్తున్న వ్యక్తిగా ఓ బుడ్డోడు, శిక్షకు గురైన తారక్ గా మరో బుడ్డోడు చక్కగా తమ హావాభావాలతో నాటకం మాదిరిగా ప్రదర్శించారు. అది చూసి జనాలు చప్పట్లు కొడుతున్నారు.

‘వాహ్..బుడ్డోళ్లు అదరగొట్టారు’ అని వీడియో చూసి ప్రతీ ఒక్కరు అంటున్నారు. వీడియోను ఇంకా వైరల్ చేస్తున్నారు. RRR పిక్చర్ రూ.1,000 కోట్ల జాబితాలోకి చేరిపోయిన సంగతి అందరికీ విదితమే. నందమూరి తారకరామారావు హావభావాలు ఈ పాటలో హైలైట్ కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news