క్యాప్సికమ్, ఆలివ్ ఆయిల్ కాంబోతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్న అధ్యయనాలు

-

వెంట్రుకలు ఒకసారి ఊడాయంటే.. కొత్త వెంట్రులు మళ్లీ ఆ ప్లేస్ లో డవలప్ అ‌వడానికి సుమారు 20 రోజులు పడుతుంది. హెయిర్ రూట్.. ఈ 20రోజులు రెస్ట్ తీసుకుని అప్పుడు నిదానంగా కొత్తది పుట్టుకొస్తుంది. ఈ టైమ్ పిరియడన్ ను తగ్గించి 10 రోజుల్లోనే కొత్త వెంట్రుక అక్కడ వచ్చేసిందంటే.. 35 శాతం టైమ్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్లకు సుమారుగా రోజుకు 100 వెంట్రుకలు ఊడిపోతాయనుకుంటే.. మళ్లీ అవి రావాలంటే.. ఎన్ని డేస్ పడుతుంది మీరే ఆలోచించండి.. మనం ఈ టైమ్ ను తగ్గిస్తే.. తక్కువ టైం లో ఎక్కువ హెయిర్ వస్తుంది. క్యాప్సికమ్, ఆలివ్ ఆయిల్ తో ఇలా చేయొచ్చని సైంటిఫిక్ గా నిరూపించారు. ఇంకెందుకు ఆలస్యం.. క్యాప్సికమ్ ఆయిల్ ను ఎలా వాడాలో, ఏం ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..!
నగోయా సిటీ యూనివర్శిటీ జపాన్( Nagoya CIty University- Japan 2007) వారు క్యాప్సిక్, ఆలివ్ ఆయిల్ మీద పరిశోధన చేసి కొన్ని విషయాలు చెప్పారు. క్యాప్సికమ్ లో క్యాప్స్ సైసిన్( capsaicin) అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది హెయిర్ రూట్స్ కు నర్వ్ స్టిమ్యులేట్ చేసి.. సర్యూలేషన్ చేసేట్లు చేస్తుంది. జుట్టుకుదుళ్లకు రక్తప్రసరణ బాగా అందితే.. పోషకాలు బాగా వచ్చేస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ పోషకాలు అందుతాయనమాట.
స్కాల్ప్ సెల్స్, హెయిర్ రూట్స్ లో IGF-1 అనే దాన్ని క్యాప్స్ సైసిన్( capsaicin) కెమికల్ ఉత్పత్తి పెంచుతుంది. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుంది.. నిద్రాణంలో ఉన్న.. హెయిర్ రూట్స్ యాక్టివేట్ అవుతాయి. కొత్త వెంట్రుక తిరిగి వెంటనే అక్కడే మొలవడానికి అవకాశం ఉంది. హెయిర్ గ్రోత్ కు పనిచేస్తుంది.
ఇందులో ఉండే phylloquinone, isoflavones ఉండటం వల్ల.. హెయిర్ రూట్స్ కి, హెయిర్ కి డ్రైనెస్ రాకుండా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండేట్లు చేస్తున్నాయని వాళ్లు ఇవ్వటం జరిగింది.

ఆలివ్ ఆయిల్ ను క్యాప్సికమ్ తో ఎలా తయారు చేయాలంటే..

ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకుని తురమేసి..100ml ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో క్యాప్సికమ్ తురుము వేసి మూతపెట్టండి. దీన్ని ప్రజర్ కుక్కర్లోనో, విడిగా నీళ్లలోనే పెట్టేసి.. ఆవిరి మీద వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల.. క్యాప్సికమ్ లో ఉండే మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ కూడా ఆయిల్ లోకి వచ్చేస్తాయి. ఆ తర్వతా వడకట్టి.. జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేసుకోండి. తలకు బాగా పట్టించి స్కాల్ పు మసాజ్ చేయండి. జుట్టుకు కూడా రాస్తే. జుట్టు స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది.
బయట మార్కెట్ లో బోలెడు ఆయిల్స్ ఉన్నాయి. కానీ అవేవి సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఈ క్యాప్సికమ్, ఆలివ్ ఆయిల్ కాంబో బాగా పనిచేస్తుందని సైంటిఫిక్ గ్రా నిరూపించారు కాబట్టి.. హ్యాపీగా వాడుకోవచ్చు. అందరూ ఇలాంటి ఆయిల్ తయారుచేసుకుని.. పిల్లలకు ముందు నుంచే వాడితే.. జుట్టు చాలా బాగుంటుంది. అందరూ జుట్టు ఒత్తుగా రావాలి.. పలచగా ఉండొద్దు అనుకుంటారు. ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి.. ఒక నెలరోజులు పాటు వాడి చూడండి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news