80 రోజులు అయినా కూడా జపాన్ లో తగ్గని RRR క్రేజ్.!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే హాలీవుడ్ లో ఎక్కువుగా ఆసక్తి వుంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కోసం రాజమౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ అక్కడకు వెళ్ళిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అక్కడ సినిమా విడుదల అయ్యి 80 రోజులు కావస్తున్నా కూడా క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్ల పరంగా ముత్తు, బాహుబలి దాటి ఒకటవ స్థానంలో నిలిచింది. ఇంకా కలెక్షన్స్ కొల్ల గొడుతూనే ఉంది.ఇప్పుడు ఏకంగా 505 మిలియన్ జపాన్ యిన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది. మన రూపాయల్లో చూస్తే 31.45 కోట్ల రూపాయల దాకా వసూళ్ళు వచ్చాయి.

మరో వైపు లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ తరుపున రాజ మౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాలలో ఆర్ ఆర్ ఆర్ మూవీ నామినేషన్స్ ని సాధించింది. బెస్ట్ మోషన్ పిక్చర్ ఆఫ్ పారిన్ మూవీస్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ పోటీపడనుంది. అంతే కాకుండా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ పోటీ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version