వరుస అవార్డుల వర్షం కురిపిస్తున్న ఆర్ఆర్ఆర్.. బెస్ట్ ఫారిన్ ఫిలిం..!

-

ప్రపంచమంతా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ మరికొన్ని గంటలలో తెలియనుంది.. అయితే ఈసారి మాత్రం ప్రపంచ సినీ లవర్స్ ని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ..RRR సినిమాతో డైరెక్టర్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఇప్పటికే ఈ సినిమా అంతర్జాతీయంగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకొని ఆస్కార్ రేసులో నిలవడంతో హాట్ టాపిక్ గా మారుతోంది.

అయితే ఇలాంటి తరుణంలో RRR చిత్రానికి మరొక అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన జపాన్ అకాడమీ అవార్డులలో బెస్ట్ ఫారిన్ చిత్రంగా ఈ సినిమా అవార్డును సొంతం చేసుకున్నది.. జపాన్ దేశంలో గత సంవత్సరం భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రజలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు జపాన్ అకాడమీ అవార్డు రావడం మరింత సులభతరంగా మారింది. ఈ అవార్డును మార్చి 10వ తేదీన అందజేయబోతున్నారు.

జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR చిత్రం ఏకంగా 650 మిలియన్ల కలెక్షన్ చేసింది. ఆ దేశంలో ఎక్కువ మొత్తంలో వసూలు సాధించిన ఇండియన్ చిత్రంగా RRR చిత్రం నిలవడం జరిగింది. ఇక ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉన్న ఈ చిత్రం భారత సినీ చరిత్రను తిరగ రాస్తుందని అభిమానులు మాత్రం చాలా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా మరికొన్ని గంటలలో ఆస్కార్ నామినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ భవిష్యత్తు తేలబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version