తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ అనేక కసరత్తులు చేస్తున్నారు. ముక్యంగా పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి కేసీఆర్ సర్కార్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తోంది.
సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే.. వచ్చే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేయనుంది. ప్రత్యేక బడ్జెట్ దీనికోసం పెట్టి.. ఏప్రిల్ నుంచే ఈ స్కీమ్ ను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఏప్రిల్ నుంచే ఈ పథకం అమలు అయితే.. చాలా మంది సామన్య ప్రజలకు లబ్ది చేకూరనుంది. ఈ పథకంతో పాటు.. వ్యవసాయ రంగంలోనూ మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని నిర్నయం తీసుకుంది. అంతేకాదు… ఏప్రిల్ మాసం నుంచే… కొత్త పింఛన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.