సజ్జనార్‌ సంచలన నిర్ణయం.. ఫోన్‌ చేస్తే ఇక ఇంటికే బస్సు

సంక్రాంతి పండుగ చూస్తుండగానే వచ్చేసింది. మరో రెండు రోజుల్లోనే పండుగ ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్‌ లో ఉన్న ఉద్యోగాలు, వ్యాపారస్థులు, విద్యార్తులు, ఇతరులు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలు దేరుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు బాగా రద్దీగా తయారయ్యాయి. అటు ఎన్ని ప్రత్యేకమైన బస్సులు వేసినా… సరిపోవడం లేదు.

ఇలాంటి తరుణంలో… తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్ల కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. హైదరాబాద్‌ లోని ఏదైనా ఒక ప్రాంతం నుంచి వెళ్లాలనుకునే కాలనీవాసులు, కార్మికులు, విద్యార్థులు 30 కంటే.. ఎక్కువ మంది ఉంటే బస్సును వారి ప్రాంతానికే పంపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ఎంజీబీఎస్‌ బస్‌ స్టాప్‌ కు ఫోన్‌ చేసేవారు… 9959226257 కు, జేబీఎస్‌ కు చేసే వారు 9959226246 అనే నంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు. దీంతో ప్రయాణికులు కాస్త ఊరట లభించనుంది.