తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. గడిచిన రెండేళ్లుగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ త్వరలోనే ఉపశమనం కల్పించేలా చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. చిన్న కమతాలు, బ్యాంకు రుణాలు మరియు రైతు బీమా ఇతర అవసరాల కోసం కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున పంపకాలు చేసుకున్న భూములను దృష్టిలో పెట్టుకొని తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పేరిట వ్యవసాయ భూమి ఉన్నా, ఆ భూమిపై ఎన్ని బ్యాంకుల్లో రుణ లు బాకీ పడి ఉన్నా, యాజమాని ఒక్కరికి రుణ విముక్తి పథకం వర్తించేలా కఠినమైన నిబంధనలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.75 వేల నుంచి లక్ష వరకు బకాయిలు ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ చేసేందుకు అడుగులు వేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.