ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా ఇటీవలే స్పుత్‌నిక్-వి పేరిట విడుదల చేసిన విషయం విదితమే. ఈ వ్యాక్సిన్‌కు రష్యా వచ్చే వారం నుంచి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. అక్కడి గమాలియా ఇనిస్టిట్యూట్‌తోపాటు రష్యా రక్షణ విభాగం ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను రష్యా నెలకు 60 లక్షల డోసుల చొప్పున ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.
స్పుత్‌నిక్ – వి వ్యాక్సిన్‌ను రష్యా ముందుగా నెలకు 15 లక్షల డోసులతో మొదలు పెట్టి 20 లక్షలకు పెంచుతుంది. తరువాత క్రమంగా నెలకు 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ వ్యాక్సిన్‌ను భారత్ లో ఉత్పత్తి చేసేందుకు గాను రష్యా కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. కానీ వ్యాక్సిన్‌కు చెందిన ఫేజ్ 1,2 క్లినికల్ ట్రయల్స్ డేటాను అందజేయాలని భారత్ రష్యాను కోరింది. అయితే దీనిపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్ కోసం ఇప్పటికే లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ కోసం రష్యాకు ఆర్డర్లు ఇస్తున్నాయి. అయితే మరోవైపు ఆ వ్యాక్సిన్‌పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అక్కడి వైద్యుల్లో సగం మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సిద్ధంగా లేరని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఫేజ్ 1, 2 ట్రయల్స్ డేటాను త్వరలో విడుదల చేస్తామని రష్యా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని తెలిపింది.