టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై వెళుతుండగా తేజ్ ప్రమాదవశాత్తూ కింద పడ్డారు. దాంతో చికిత్స కోసం మొదట స్థానిక మెడి కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరవాత పవన్ కళ్యాణ్ పరామర్శించి అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా తాజాగా అపోలో వైద్యులు తేజ్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసారు. తేజ కు సిటీ స్కాన్ తో పాటు ఇతర తెస్తులు చేసినట్టు తెలిపారు.
ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యిందని ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇన్ సైడ్ బ్లీడింగ్ లేదా ఆర్గాన్ డ్యామేజ్ జరగలేదని వెల్లడించారు. 24 గంటలపాటు తేజ్ ను ఐసియూ లోనే ఉంచుతామని చెప్పారు. ఇదిలా ఉండగా తేజ్ రోడ్డు ప్రమాదం లో గాయ పడటం తో మెగా ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యం తో తిరిగిరావాలని కోరుకుంటున్నారు.