ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోని ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయాలని వెల్లడించారు ప్రభుత్వానికి దఖలు పడిన భూమిని పేదలకు ఇస్తే తప్పేంటని అడిగారు సజ్జల. ప్రతిపక్షాల తీరు చాలా అన్యాయంగా ఉందని తెలిపారు ఆయన. రైతుల వెనుక ఎవరున్నారో ప్రతిఒక్కరికీ తెలుసన్నారు సజ్జల. పేదలు లేకుండా, శ్రామికులు, కార్మికులు లేకుండా ఏ నగరమైనా ఉంటుందా అని అడిగారు సజ్జల.
మొత్తం స్వార్థం, రాజకీయ, ఆర్థిక అవసరాలను ఆశించే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని సజ్జల పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని హేళన చేశారు సజ్జల. వీళ్లందరికీ నాయకత్వం వహిస్తున్నది పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుడిలో లింగం, మట్టి అన్నీ మింగేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు ఆయన. రాజకీయ పార్టీగా టీడీపీ అర్హత కోల్పోయినట్టే అని హేళన చేశారు సజ్జల.