పేరుమార్పు బిల్లును వెనక్కితీసుకోవాలి : చంద్రబాబు

-

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పు బిల్లును వెనక్కితీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈమేరకు ఇవాళ రాజ్‌భవన్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో చీకటి జీవో తీసుకొచ్చి ఎన్టీఆర్‌ వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ పేరుపెట్టడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ ఆంధ్రప్రజలు ఆరాద్యదైవమని, నటుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయ, సినీరంగాల్లో ఎన్టీఆర్‌ ఒక క్రియేటర్‌గా నిలిచిపోయారని అన్నారు.

ఎన్టీఆర్‌ పేరుమార్పు అనాగరిక చర్య : చంద్రబాబు

పేద ప్రజల భవిష్యత్‌ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్‌ ప్రారంభించారని తెలిపారు. ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ వైద్యరంగానికి అనేక సేవలు చేశారని ఆయన హాయంలోనే 1986లో ఆరోగ్య వర్సిటీని ప్రారంభించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు గాను తాను 1998లో ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టానని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఆంధ్రలో 32 మెడికల్‌ కళాశాలలు వచ్చాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news