కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయి : సజ్జల

-

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల పవనాలు వీచిన నేపథ్యంలో, ఆ విషయం పై స్పందించారు. ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని అన్నారు. కౌంటింగ్ లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మొత్తంగా వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడకపోయినా.. సజ్జల రామచంద్రారెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగిందని ఆయన తెలిపారు. ‘మా ఓటర్లు వేరే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు బాగా ఆదరించారు ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో మారిపోయిందని అనుకోవద్దు. అవకతవకలపై ఈసీకీ ఫిర్యాదు చేశాను.

సీపీఐ, సీపీఎం ఓట్లు కూడా టీడీపీకి పడ్డాయి. ఇది ప్రజా వ్యతిరేకత ఎందుకవుతుంది. ఈ ఓటమి ఏ రకంగానూ ప్రభావం చూపదు. ప్రజల్లో ఉన్న ఓ చిన్న సెక్షన్ మాత్రమే ఓట్లు వేసింది. ఈ రిజల్ట్స్ సొసైటీని మొత్తం రిప్రజెంట్ చేసేవి కావు. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదం’ అని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే సజ్జల వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. పట్టభద్రులు చంద్రబాబును నమ్ముతున్నారని.. సీఎం జగన్‌ను నమ్మడం లేదని, అందుకే ఎమ్మల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించారని అంటున్నారు. సీఎం జగన్ రాజధానిపై తీసుకున్న నిర్ణయాన్ని కూడా పట్టభద్రులు వ్యతిరేకిస్తున్నారని అందుకే రాయలసీమలో కూడా టీడీపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version