జగన్ కు బిగ్ షాక్..సాక్షి టీవీ అనుమతులు రద్దు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. జగన్ సొంత టీవీ ఛానల్ సాక్షికి…. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సాక్షి టీవీకి జారీచేసిన అనుమతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో అనుమతించిన ఛానల్ లో జాబితా నుంచి సాక్షి టీవీని తొలగించినట్లు సమాచారం అందుతోంది. గత నెల 26వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సాక్షి కి కేంద్ర హోంశాఖ… సెక్యూరిటీ క్లియరెన్స్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే ఛానళ్లకు కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ మంజూరు చేస్తుంది. అది ఉంటేనే… ఆయా చానళ్లకు కేంద్ర సమాచార శాఖ అనుమతి ఇస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ఛానల్ అయిన సాక్షికి.. ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్ర హోంశాఖ ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆ చానల్ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులో ఉన్నందుకా ? లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా ? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సాక్షి టీవీకి అనుమతులు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆ ఛానల్ సిబ్బంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. టీవీకి అనుమతులు రద్దు చేసే తాము ఉపాధి కోల్పోతారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టులో… సాక్షి టీవీ కి తాత్కాలిక ఊరట లభించినట్లూ సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ తతంగమంతా చాలా సైలెంట్ గా జరిగింది. ఎవరికీ తెలియకుండా సాక్షి యాజమాన్యం ముందుకు పోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news