మీకు బ్యాంక్ లో శాలరీ అకౌంట్ వుందా..? అయితే ఈ లాభాలు పొందచ్చట..!

-

మాములుగా బ్యాంకుల్లో రెండు రకాల అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యడానికి ఒకటి. ఒకటేమో శాలరీ అకౌంట్. ఇంకొకటి ఏమో సేవింగ్స్ అకౌంట్. ఎవరైనా సరే సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. అయితే దీని పైన లిమిట్ ఉంటుంది. ఇక శాలరీ అకౌంట్ గురించి చూస్తే.. శాలరీ అకౌంట్లోకి మీ కంపెనీ ప్రతి నెలా మీ శాలరీ పడుతుంది. చాలా మంది సేవింగ్స్ అకౌంట్‌ను, శాలరీ అకౌంట్‌ను ఒకలానే ఉంచుతుంటారు. వేర్వేరుగా కూడా కొంతమంది వుంచుకుంటుంటారు.

శాలరీ అకౌంట్ తో ఈ లాభాలుంటాయి:

శాలరీ అకౌంట్‌ను జీరో బ్యాలెన్స్ అకౌంట్‌గా అందిస్తాయి. ఒకవేళ బ్యాలెన్స్ ఏమి లేకపోయినా సరే ఎలాంటి పెనాల్టీ పడదు.
అలానే ఉచిత ఏటీఎం లావాదేవీలు కూడా పొందొచ్చు. లిమిట్ ఏమి లేకుండా ఏటీఎం లావాదేవీలు చేసుకునే అవకాశం వుంది. చార్జెస్ ఏమి పడవు.
లాకర్ ఛార్జీలపై డిస్కౌంట్ ని కూడా శాలరీ అకౌంట్ తో పొందొచ్చు. చాలా బ్యాంకులు శాలరీ అకౌంట్లపై లాకర్ ఛార్జీలను మాఫీ చేస్తుంటాయి.
డీమ్యాట్ అకౌంట్ సౌకర్యం ని కూడా పొందొచ్చు.
ఈజీగా లోన్ ని కూడా తీసుకునే అవకాశం వుంది.
క్రెడిట్ కార్డు వంటి ఫెసిలిటీస్‌ను కూడా పొందొచ్చు. ఇలా శాలరీ అకౌంట్ ని కలిగి ఉంటే ఈ బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news