అయోడిన్ కోసమే ఉప్పును వాడక్కర్లేదు.. ఈ రెండు పదార్థాల ద్వారా కావల్సినంత అయోడిన్ వస్తుందట..!

-

మనందరికి థారాయిడ్ గ్రంధి పనిచేయాలి అంటే..అయోడిన్ కావాలి. ఒక రోజుకు పెద్దలకు శరీరానికి కావాల్సిన అయోడిన్ 140 మైక్రో గ్రామ్స్. ఈ ఆయోడిన్ అనేది శరీరానికి అందకపోతే ఏం నష్టం జరుగుతుంది. దీని వల్ల కలిగే లాభాలేంటి చూద్దాం.

మనం అయోడిన్ అనేది శరీరానికి సరిపడా అందించినప్పుడు ధైరాయిడ్ గ్రంధి నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఈ గ్రంధి ఉత్పత్తి చేసే రెండు హార్మోన్స్ T3, T4 హార్మోన్ యొక్క ప్రొడెక్షన్ కు అయోడిన్ కావాలి. మన శరీరంలో సెల్స్ లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ మైటోకాండ్రియన్స్ ఎనర్జీని రిలీజ్ చేయాలంటే..అయోడిన్ కావాలి.

అయోడిన్ అవసరం శరీరానికి ఎందకు అవసరం:

ఎముకల గ్రోత్ కి అయోడిన్ కావాలి. అయోడిన్ లోపం ఏర్పడితే..ఎముకలు వీక్ అవుతాయి. గుల్లబారుతాయి.
అయోడిన్ నరాల గ్రోత్ కి, నర్వ్ సెల్స్ కొత్తగా సెల్స్ ప్రొడక్షన్ కు కూడా అయోడిన్ కావాలి
మెమరీకి కూడా కొన్ని కాంగ్నేటివ్ ఫంక్షన్స్ కి అయోడిన్ కావాలి
ఇవి అయోడిన్ వల్ల ప్రధానమైన లాభాలు. మనం 140మిల్లీగ్రాముల అయోడిన్ ను శరీరానికి డైలీ అందించినప్పుడు ఈ పనులన్నీ జరుగుతాయి.

అయోడిన్ లోపిస్తే ఏం జరుగుతుంది:

అయోడిన్ లోపిస్తే మన శరీరంలో ధైరాయిడ్ గ్రంధిపైన వాపు వస్తుంది. గ్వాయిటర్ అంటారు కదా..అది ప్రధానంగా వస్తుంది.
అయోడిన్ తగ్గినప్పుడు అలసట, నీరసం ఉంటుంది.
చలిని తట్టుకోలేరు.
వెయిట్ పెరుగుతారు
వీటితోపాటు మలబద్ధకం కూడా ఏర్పడుతుంది.

అయోడిన్ అనేది సాల్ట్ ద్వారానే వస్తుందని చాలామంది అనుకుంటారు. మనకు టీవీ యాడ్స్ లో కూడా సాల్ట్ లో అయోడిన్ ఉన్నట్లు చూపిస్తారు. కానీ సాల్ట్ వాడొద్దని..ఉప్పులేకుండా వంటలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఓ పక్క చెప్తుంటారు. మరి మనకు అయోడిన్ లోపం లేకుండా అందాలంటే..కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వాటిల్లో అయోడిన్ ఉంటుంది..కానీ మనకు కావల్సినంత ఉండదు. మనకు రోజుకు కావాల్సిన 140మైక్రోగ్రామ్స్ అయోడిన్ లోపించకుండా అందించే అతిముఖ్యమైన ఆహారాలు రెండు ఉన్నాయి. అవేంటంటే

పెరుగు, పాలు. ఈ పెరుగు పాలల్లో అయోడిన్ బాగా పుష్కలంగా ఉంటుంది. పెరుగు 250ML అంటే ఒక పావులీటర్ పెరుగు తిన్నామనుకోండి..116 మైక్రోగ్రాముల అయోడిన్ వస్తుంది. పాలు250 ML తాగితే..85 మైక్రోగ్రాములు అయోడిన్ అందుతుంది. అంటే మనకు లభించే ఆహారాల్లో అన్నింటి కంటే ఎక్కువగా పెరుగు పాలల్లోనే లభిస్తుంది. చాలామంది..మధ్యాహ్నం, రాత్రి వాడుతారు. అలా మనకు తెలియకుండానే మనకు అయోడిన్ అందుతుంది.

మనం పీల్చుకునే గాలి ద్వారా ఒకరోజుకు 5 మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఆటోమెటిక్ గా శరీరానికి అందుతుంది. కాలువ నీరుని ఒక లీటర్ తీసుకుంటే..5-20 మైక్రోగ్రాముల అయోడిన్ ఉంటుంది. డైరెక్టుగా కాలవ నీరును మనం డైరెక్టుగా తాగము..ఫిల్టర్ చేసినప్పుడు కాస్త తగ్గుతుంది కానీ..అయోడిన్ ఉంటుంది. RO వాటర్ తాగినప్పుడు మాత్రమే..అయోడిన్ మొత్తం పోతుంది.

ఇలా అన్నీరూపాల్లో అయోడిన్ శరీరానికి అందుతుంది..కాబట్టి అయోడిన్ కోసమనే సాల్ట్ ను వాడుకోనవసరం లేదు. అంటే..ఇలాంటి సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే..నాచురల్గా ఇవి అందించినప్పుడు బయటనుంచి ఇవ్వాల్సిన పనిలేదు.

అయోడిన్ అనేది వాటర్ సాలిబల్ లవణం. ఇది ఏరోజుకు ఆరోజు అందించాల్సిందే..ఒక రోజు ఎక్కువ అందించినా..అది శరీరంలో ఉండడు. వెళ్లిపోతుంది. మళ్లీ మరుసటిరోజు అందించాల్సిందే. అంటే..కావల్సినంత ఉంచకుని మిగతాది మలం ద్వారానో, మూత్రం ద్వారానో వచ్చేస్తుంది. ఇది వేడిచేసినప్పుడు 184 డిగ్రీల వేడివరకూ తట్టుకునే గుణం కలిగిఉంటుంది. మనం పాలును మరిగించినప్పుడు 100 డిగ్రీల వేడికే పాలుమరిగిపోతాయి. కాబట్టి మనం పాలుమరిగించినా అయోడిన్ ఏం పోదు..పెరుగ్గా తోడుపెట్టుకున్నా అయోడిన్ పోదు.

ఈరోజుల్లో ఎక్కువమందికి ధైరాయిడ్ గ్రంధి లోపం అనేది అయోడిన్ లోపం వల్లే రావటంలేదు. మంచి పోషకాహారాలు ఉన్న ఫుడ్ తినకపోవడం, మానసిక ఒత్తిడి లాంటివి కూడా కారణం అవుతుంది. నాచురల్ ఫుడ్స్ బాగా ఎక్కువ తీసుకుంటే..అయోడిన్ తో పాటు..మంచి విటమిన్స్ కూడా అందుతాయి కాబట్టి..భవిష్యత్తులో ధైరాయిడ్ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news