టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమంత.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల అక్కినేని నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన అనంతరం… ఆమెపై నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాటికి ఎప్పటికప్పుడు సమంత కౌంటర్ ఇస్తూనే వస్తుంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా సంచలన పోస్ట్ పెట్టింది సమంత.”ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఏం నమ్ముతున్నారు ఏం ఆశిస్తున్నారు. ఇవన్నీ జైల్లో ఉచలాంటివి. వాటి నుంచి విముక్తి పొందాలనుకుంటే.. అవి వాళ్ల మనసు అనే జైలుకు ఉన్న ఊచలని.. మీకు కాదని గ్రహించి ముందుకు సాగిపోవాలి. ఎవరి అభిప్రాయాలు మీ జీవితాన్ని నిర్దేశించలేవు. కాబట్టి ఎదుటి వాళ్ళ అభిప్రాయంతో మీకు అవసరం లేదు. నీ జీవితం నీదే. ఈ విషయాన్ని మనసుతో అర్థం చేసుకుంటే నువ్వు మరింత స్వేచ్ఛగా ఉండగలవు ” అంటూ సమంత ట్వీట్ చేసింది.