సమంతకు ఓ అభిమాని గుడి కట్టేశాడట….ఎక్కడంటే..!

-

సినీనటి సమంతపై అభిమానంతో ఆమెకు గుడి కట్టాడు ఓ అభిమాని. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన సందీప్​కు సమంత అంటే పిచ్చి అభిమానం. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు సందీప్ పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించటంలో సమంత చూపిన చొరవ సందీప్​ని ఆకట్టుకుంది. అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం రెట్టింపైంది.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటంలో ఆమె చూపిస్తున్న చొరవకు ఆయన అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని… కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version