త‌ల‌చిన‌దే జ‌రిగినది..ఓవ‌ర్ టు యోగి

-

ప్ర‌స్తుతం వెల్ల‌డికి నోచుకుంటున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాలన్నీ ముందుగా ఊహించినవే అయినా, తృణమూల్ కాంగ్రెస్ కి గోవాలో సీట్లు వస్తాయని  అస్సలు అనుకోలేదు..అంటూ నెటిజ‌న్ నాస్తిక సూర్య త‌న‌దైన విశ్లేష‌ణ ఇస్తున్నారు.చ‌ద‌వండిక.

yogi-adityanath
yogi-adityanath

Point No 1 :
2024 లో బిజెపీకి ప్రత్యామ్నాయం మేమే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి.తన ప్రభావాన్ని ఎంత మాత్రం చూపించలేకపోయింది. పాత కాలంనాటి రాజకీయాలు ఇంకా చేస్తామంటే కుదరదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా క్రమశిక్షణ లేకుండా కొట్టుకుచచ్చే సిద్ధూ లాంటి వాళ్ళతోనే రాజకీయాలు చేస్తామంటే ఈ న్యూ ఏజ్ లో అస్సలు సాధ్యం కాదు.సమూలంగా పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీలో కనపడుతుంది.పార్టీ ప్రక్షాళన కూడా సాధ్యమయ్యే విషయం కాదని వాళ్ళకీ అర్ధమైందనే అనుకుంటున్నా. అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నా, చివరికి ఐక్యంగా పోరాడలేని స్వార్థంతో ఉంటే ఇలాంటి రిజల్ట్సే వస్తాయ్.

Point No 2 :
యూపీ లో బీజేపీ ప్రభావం చాలా వరకు తగ్గినా,ఈ సారి దాని గెలుపున‌కు, మెజారిటీ కారణం అక్కడ గూండా రాజ్ పైన ఉక్కుపాదం మోపడం,గత పాలక పార్టీల అండతో రెచ్చిపోయోన మాఫియాని చాలా వరకు యోగి ఏరిపారేశాడు.లా అండ్ ఆర్డర్ చాలా వరకూ కంట్రోల్ లో ఉంది.హిందూ అతివాదుల,కుల అహంకారుల పంచాయితీలు మినహా, గతం నుంచి వస్తున్న మాఫియాని దాదాపు నిర్మూలించడం యోగికి సాధ్య‌మైంది.గతంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధి యూపీ ప్రజలు చూస్తున్నారనడంలో కూడా ఎలాంటి సందేహం అక్కర్లేదు.కొన్ని ఫేక్ ఫొటోలు ప్రచారంలో ఉంచడాన్ని హేళనగా చూసినా వాటికన్నా ఎక్కువే అక్కడ డెవలప్మెంట్ చేశారు.ఇది గ్రౌండ్ రియాలిటీ.అక్కడి వాళ్ళతో మాట్లాడి రాస్తున్నా.వీటి వల్లే అక్కడి ప్రజలలో సానుకూలత ఏర్పడింది.రామమందిర నిర్మాణం,హిందూ ఓట్ బాంక్ కన్నా ఈ అంశాలే ఇంతటి వ్యతిరేకతలోనూ బీజేపీని నిలబెట్టాయి.తన మార్క్ పోలరైజేషన్,ఫేక్ ప్రచారం ఎలాగూ ఉంటుంది. ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీలు SP గానీ కాంగ్రెస్ గానీ సమీకరణాల్నే నమ్ముకున్నాయి తప్ప మారుతున్న ఓటర్ల మూడ్ ని చూడట్లేదు.బీజేపీకి ఈ విజయం ఒక పెద్ద రిలీఫ్. ఇకనైనా తన మత రాజకీయాలకు కాలం చెల్లిందని గ్రహించి ప్రజల కోణంలో ఆలోచిస్తుందేమో చూడాలి. ఇది దురాశే…

Point No 3 :
ఆప్ కి ఉన్న సానుకూలాంశం ఒక ప్రాంతీయ పార్టీగా ముద్ర పడకపోవడం.ఆ విధంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం. ఇంకో పదేళ్ళకో,పదిహేనేళ్ళకో ఆప్..బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ వ్యాప్తంగా ఎదుగుతుందనే సంకేతాలు బలంగా కనపడుతు న్నాయ్. పంజాబ్ లో ఆప్ భారీ విజయానికి కాంగ్రెస్ పార్టీనే కారణం.దాని మూస రాజకీయ నాటకాలకి చన్నీ రూపంలో ఒకరకంగా దళిత్ నాయకత్వాన్ని బలిచేశారనుకోవచ్చు.ఇప్పుడు ఆప్ తన మార్క్ ని చూపించాల్సి ఉంటుంది.ఢిల్లీ, పంజాబ్ లు పక్కనే ఉన్నా,ఓటర్ల నాడి వేరు.అవసరాలూ వేరు.ఈ రెండు చోట్లా పరస్పర విరుద్ధ అంశాలూ ఉన్నాయి. వాటన్నింటినీ సానుకూలంగా మార్చుకోగలిగితే ఆప్ రాజకీయాలు దేశ వ్యాప్త మానిఫెస్టో ప్రిపరేషన్ కి దారితీయొచ్చు.

Point No 4 :
కొంచెం పరపతి,ప్రణాళికా,రాజకీయ ఎత్తుగడలు తోడైతే ఎక్కడైనా పాగా వేయడానికి అవకాశం ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ నిరూపించింది.ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ ని మెచ్చుకోకుండా ఉండలేం.అదే సందర్భంలో దేశానికి ఇలాంటివి చాలా ప్రమాద కరంగానూ మార్చగలవు.ఈవెన్ ఒక నియంతని కూడా ఎత్తుగడలతో గొప్ప మానవతామూర్తిగా చిత్రించి ఓట్లు పొందొచ్చు.

అయినా ఆ వ్యూహాలని ప్రజలు త్వరగానే అర్థం చేసుకుంటారు.ఎల్లకాలం ఇవే చెల్లవు కూడా..! చివరిగా..బీజేపీ గద్దె దిగాలని కోరుకునే నాకు దాని విజయం,దానికి ఉన్న సానుకూల అంశాలూ చూస్తుంటే,ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ మూస పద్ధ‌తి, ఇతర ప్రతిపక్షాల నిస్సహాయతనీ చూస్తుంటే 2024 లోనూ బీజేపీ గద్దెనెక్కడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది.ఇంకోపక్క అసలు బీజేపీని దించాలని ఎవరు అనుకుంటున్నారనే భేతాళ ప్రశ్న ఉండనే ఉంది.నా తరపున ఆప్ కి కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు.

– నాస్తిక్ సూర్య 

Read more RELATED
Recommended to you

Latest news