శాంసంగ్ గెలాక్సీ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అదే Samsung Galaxy AO4. ప్రస్తుతానికి ఈ ఫోన్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలో కూడా లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మార్కెట్లో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతేడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ03కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ04 ధర..
దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
దీని ఫీచర్లను బట్టి ధర రూ.10 వేలలోపే ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ04 స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని ప్రాసెసర్ వివరాలను ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఎక్సినోస్ 850 అయ్యే అవకాశం ఉంది.
4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో గెలాక్సీ ఏ04 లాంచ్ అయింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎస్ ఆధారిత వన్ యూఐ 4.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొదటి ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4నే.