బంధువులతో బ్యాడ్ నేమ్..ఆ ఎమ్మెల్యేలకు గండం!

-

నేటి రాజకీయాల్లో ఎవరైనా సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి గల నేతలు ఉంటే…వారి పేర్లు చెప్పుకుని…వారి బంధువులు హడావిడి చేయడం ఎక్కువైపోయింది. ఒక ఎమ్మెల్యే ఉంటే…ఆ ఎమ్మెల్యే కుమారుడు అని, బామ్మర్ది అని, సోదరుడు అని ఇలా దూరపు చుట్టరికం సైతం కలుపుకుని కొందరు బంధువులు రాజకీయంగా ఆధిపత్యం చెలాయించడానికి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలో ఇలా బంధువుల హడావిడి ఎక్కువ ఉంది.

కావలసిన పనులు చేయించుకుంటారు…కాంట్రాక్టులు దక్కించుకుంటారు…అలాగే ప్రజల మీద పెత్తనం చెలయిస్తారు. అదేంటో గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార నేతల బంధువులు అందరూ…అధికారాన్ని దుర్వినియోగం చేయడంలోనే ఎక్కువ బిజీగా ఉంటారు. ఉదాహరణకు మంత్రి ఉంటే…ఆ మంత్రి బంధువులు అని చెప్పి ఎంతమంది రాజకీయాల్లో హడావిడి చేస్తారో చెప్పాల్సిన పని లేదు.

అయితే ఏపీలో ఈ బంధువుల రాజకీయం ఎక్కువైపోయింది..ఒక ఎం‌పి‌టి‌సి దగ్గర నుంచి మంత్రి వరకు..చెప్పుకుంటూ బంధువుల డామినేషన్ కనిపిస్తోంది. ఇక వీరంతా అక్రమాలు చేయడంలోనే ముందు ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేల వారసులు రాజకీయంగా షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అధికారం లేకపోయినా సరే వారసుల హడావిడి ఎక్కువగా ఉంటుంది.

రాష్ట్రంలో చాలామంది వారసులు ఇదే పనిలో ఉన్నారు…అటు ఎమ్మెల్యేల బామ్మర్దులు అంటూ కొందరు హడావిడి. అలాగే ఎమ్మెల్యేల సోదరుల రచ్చ కొంత ఉంది. ఈ రచ్చ వల్లే చాలామంది ఎమ్మెల్యేలకు నెగిటివ్ ఎక్కువ పెరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే బంధువులే ఎమ్మెల్యేల ఓటమికి కారణమయ్యేలా ఉన్నారు.

వారు చేసే అక్రమాలే ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాయి. ఏపీలో ఎమ్మెల్యేల వల్ల నియోజకవర్గ ప్రజలు బాగుపడటం కంటే…వారి బంధుబులు బాగుపడటం ఎక్కువగా జరుగుతుంది…ఎప్పటికైనా ఈ బంధువుల వల్ల ఎమ్మెల్యేలకు బ్యాడ్ నేమ్ పెరిగి..ఓటమి దిశగా వెళ్తారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news