ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్

-

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు, తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిరిగింది.

సంజయ్ రౌత్
సంజయ్ రౌత్

రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన ఉద్ధవ్ ఠాక్రేకు కుడిభుజంలా వ్యవహరిస్తున్నారు. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. కాగా, అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్‌నాథ్ షిండేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి జీవం లేకుండా వారు ముంబైకి చేరుకుంటారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news