జులైలో లాంచ్ కానున్న Moto G42..ఫీచర్స్‌ ఇవే.. కాస్ట్‌ కాస్త ఎక్కువే..! 

-

మొటొరోలా నుంచి జీ సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ తెరపైకి వచ్చింది. అదే Moto G42. ఇండియాలో ఇది వచ్చే నెల నాలుగున లాంచ్‌ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇది బ్రెజిల్‌లో విడుదల అవడంతో.. ఫీచర్స్‌ లీకైయ్యాయి. దాదాపు అవే ఫీచర్స్‌తో ఇండియాలో కూడా లాంచ్‌ అవుతుందని టెక్‌ నిపుణుల అంచనా.. మరి ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G42 ధర..

బ్రెజిల్‌లో ఈ ఫోన్‌ ధర 1,699 బ్రెజిలియన్ రియాళ్లుగా అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,400గా నిర్ణయించారు.
మనదేశంలో దీని ధర రూ.25 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
బ్రెజిల్‌లో ఈ ఫోన్ అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

మోటో జీ42 స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ42 పనిచేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ జీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
మోటో జీ42 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండగా… యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్లస్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొబైల్ పక్కభాగంలో ఉంది.
మోటో జీ42 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా… బరువు 174.5 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

మోటో జీ42 వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఈ మూడు కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా మోటో జీ42లో ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందిచారు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news