కేరళకు చెందిన కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇండియా ఆడుతున్న మెయిన్ టోర్నమెంట్ లలో సంజు శాంసన్ ఎందుకో చోటు దక్కడం లేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో సంజు కు చుక్కెదురు కాగా, వరల్డ్ కప్ వన్ డే జట్టులోనూ చోటును దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. అయితే నిన్న బీసీసీఐ ప్రకటించిన ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ కు అయినా ఎంపికవుతాడేమో అని భావించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆఖరికి సెప్టెంబర్ 23 నుండి చైనా లో జరగనున్న ఆసియన్ గేమ్స్ లో యువకులతో నిండిన జట్టులోనూ ఇతనికి చోటు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. ఇక సంజు శాంసన్ ఇండియా జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. మళ్ళీ సంజు దేశవాళీ టోర్నీలలో రాణిస్తేనే ఇండియా లో చోటు లేదంటే కెరీర్ ప్రశ్నార్ధకమే ?
కాగా తనకన్నా తక్కువ టాలెంట్ ఉన్న క్రికెటర్లు సైతం జట్టులో కొనసాగుతుంటే.. ఇతను మాత్రం ఇంట్లో కూర్చున్నాడు.