సర్కారు వారి పాట : బర్త్ డేకు ముందే జోష్ నింపిన మహేష్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు నుండీ జరుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మరో అప్డేట్ వచ్చింది. మహేష్ పుట్టినరోజు ఈ నేపథ్యంలో ఈ అప్డేట్ ను వదిలింది చిత్రబృందం. ఆగస్టు 9న మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఈ చిత్ర బృందం. ఉదయం 9 గంటల 9 నిమిషాల కు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియో గ్లింప్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్ వదిలి… తన పుట్టిన రోజు కంటే ముందే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు మహేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version