పద్మభూషణ్ అందుకున్న సత్య నాదెళ్ల.. జనవరిలో భారత్ పర్యటన

-

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు. శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి ఆయన అవార్డు స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఆయన ఒకరు. తాజాగా పురస్కారాన్ని అందుకున్న ఆయన.. భారత ప్రభుత్వ గుర్తింపు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు సత్య నాదెళ్ల వచ్చే ఏడాది జనవరిలో భారత్​లో పర్యటించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన భారత్​కు రావడం ఇదే తొలిసారి కానుంది. హైదరాబాద్​లో జన్మించిన నాదెళ్ల.. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్నారు. 2021 జూన్​లో ఆయన సంస్థకు ఛైర్మన్​గా ఎంపికయ్యారు.

‘ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా సంచలన మార్పులు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. వచ్చే దశాబ్దం పూర్తిగా డిజిటల్ సాంకేతికతదే. భారత్​లోని చిన్నాపెద్దా పరిశ్రమలు, సంస్థలు సాంకేతికతవైపు మళ్లుతున్నాయి. ఇది గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుంది.’  – సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

Read more RELATED
Recommended to you

Latest news