గత ఏడు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అండగా పలు దేశాలు నిలిచాయి. అయితే.. తాజాగా.. రష్యా చేస్తున్న యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా అండగా నిలిచించి. మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్లను అందించబోతోంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారిక న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫోన్ చేశారని తెలిపింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు దాటింది. ఉక్రెయిన్ ఇంకా లొంగకపోవడంతో ఇటీవలి కాలంలో దాడిని రష్యా ముమ్మరం చేసింది.
డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అవసరమైతే అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం పర్యవసానాలను పశ్చిమ దేశాలు అర్థం చేసుకున్నందున ఉక్రెయిన్ దరఖాస్తు ప్రచారం అని తాను భావిస్తున్నట్లు శక్తివంతమైన పుతిన్ మిత్రుడైన భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పత్రుషేవ్కు డిప్యూటీగా ఉన్న వెనెడిక్టోవ్ అన్నారు. స్పష్టంగా వారు ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇటువంటి చర్యల ఆత్మహత్య స్వభావం నాటో సభ్యదేశాలే అర్థం చేసుకుంటుంది’ అని ఆయన అన్నారు. ‘మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అణు సంఘర్షణ రష్యా, సామూహిక పాశ్చాత్య దేశాలను మాత్రమే కాకుండా, ఈ గ్రహం మీద ఉన్న ప్రతి దేశాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది’ అని వెనెడిక్టోవ్ అన్నారు. ‘ఆ పర్యవసానాలు మానవుల౦దరికీ వినాశకరమైనవిగా ఉ౦టాయి’ అని చెప్పారు.