డబ్బులు పొదుపు చెయ్యడానికి SBI, పోస్ట్ ఆఫీస్ లో ఏది బెస్ట్…!

-

డబ్బులని పొదుపు చేయాలని అనుకునే వారికి డబ్బులని పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవాలా..? లేదా స్టేట్ బ్యాంక్ లో దాచుకోవాలా..? అని సందేహం కలుగుతుంది. మీకు కూడా ఈ సందేహం ఉందా..? అయితే దీని కోసం పూర్తి వివరాలు మీ కోసం. ప్రతి నెలా కొంత డబ్బు పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్ సేవలు అనువుగా ఉంటాయి. దీని కోసం మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆర్‌డీ అకౌంట్ ఓపన్ చేయొచ్చు. ఇలా మీరు ప్రతి నెలా రూ.100 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. SBI , పోస్టాఫీస్‌ రెండింటి లో కూడా మీరు రికరింగ్ డిపాజిట్ సేవలు పొందొచ్చు.

కేవలం స్టేట్ బ్యాంక్ మాత్రమే కాదు వివిధ బ్యాంకులు కూడా రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్లు కూడా టర్మ్ డిపాజిట్ల మాదిరే ఉంటాయి. అయితే ఎస్‌బీఐ, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లను కంపేర్ చేసే చూస్తే… ఎస్‌బీఐ ఆర్‌డీ అకౌంట్లపై వడ్డీ 5 నుంచి 5.4 శాతం లభించగా సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌లో ఆర్‌డీ ఖాతా తెరిస్తే 5.8 శాతం వడ్డీ పొందొచ్చు.

ఎస్‌బీఐ లో రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాలం ఏడాది నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. అదే పోస్టాఫీస్‌ లో ఐదేళ్లకే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అలానే స్టేట్ బ్యాంక్‌లో ఆర్‌డీ తెరిస్తే కనుక మీరు నెలకు రూ.100 నుంచి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీస్‌లో ఆర్‌డీ తెరవాలని భావిస్తే రూ.10 ఉంటె చాలు. ఎస్‌బీఐలో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి చెక్ లేదా క్యాష్ ఇవ్వొచ్చు. ఇక పోస్టాఫీస్‌లో అయితే నగదు మాత్రమే ఇవ్వాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news