స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి హెచ్చరిక..!

-

స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీరు తప్పక దీని గురించి తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాల పై ఖాతాదారులను హెచ్చరించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూజర్ ఐడీ/పాస్వర్డ్, డెబిట్ కార్డ్ పిన్, సీవీవీ, ఓటీపీ తదితర నంబర్లను ఇతరులకు షేర్ చెయ్యవద్దని స్టేట్ బ్యాంక్ అంది. అలా చేస్తే మోసపోతారని ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే బ్యాంక్స్ నుండి ఫోన్ చేసి మోసం చేస్తారని అని కూడా స్టేట్ బ్యాంక్ అంది.

అలానే ఎవరైనా ఫోన్ చేసి తాము SBI, RBI, ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్, కేవైసీ నుంచి అంటే ఏం నమ్మకండి. బ్యాంకింగ్ కి సంబంధించిన వివరాలు చెప్పద్దు అని అంది. మొబైల్ యాప్ లను అపరిచితుల నుంచి ఫోన్ కు వచ్చే మెసేజ్ లింక్స్ లాంటివి వస్తే వాటిని కూడా నమ్మద్దు. దీని వలన మోసపోవాల్సి ఉంటుంది. ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి మెసేజిలు కూడా నమ్మకండి. ఆఫర్ల పేరు తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు అందుకని జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version