హస్తంలో సీట్ల లొల్లి..రేవంత్ టీంకు ఫిక్స్?

-

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో…ఎవరికి క్లారిటీ లేకుండా ఉంది..గతంలో మాదిరిగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక పూర్తిగా ఐదేళ్లు పాలించాకే ఎన్నికలకు వెళ్తారా? అనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలని బట్టి చూస్తే…కేసీఆర్ మళ్ళీ ముందస్తుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది..అందుకే ప్రతిపక్షాలు అలెర్ట్ గా ఉంటున్నాయి.

revanth reddy

గతంలో మాదిరిగా దెబ్బతినకుండా ఉండేందుకు..ఇప్పటినుంచే ఎన్నికల యుద్ధం  మొదలుపెట్టేశాయి… అలాగే ఎక్కడకక్కడ బలమైన అభ్యర్ధులని నిలబెట్టేందుకు చూస్తున్నారు. ఇప్పటికే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు పలు నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్ధులని ఫిక్స్ చేసేశాయని చెప్పొచ్చు. ఇంకా అధికారికంగా ప్రకటించడమే ఉంది. అయితే ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి నడుస్తోంది..సీట్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది..అలాగే ఎవరికి వారు అగ్రనేతల ద్వారా లాబీయింగ్ కూడా చేసేస్తున్నారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న కొందరు నేతలకు దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయాయని తెలుస్తోంది.

ఎలాగో రేవంత్ రెడ్డి..కొడంగల్ నుంచి పోటీ చేస్తారనే విషయం తెలిసిందే…అటు ములుగులో సీతక్క పోటీ చేయడం ఖాయం. ఇక భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ పోటీ చేస్తారని తెలిసింది. పెద్దపల్లి సీటు విజయరమణారావుకు ఫిక్స్ అయింది. వరంగల్ తూర్పు సీటు రేవంత్ సన్నిహితుడు వేంరెడ్డి నరేందర్ రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. జడ్చర్ల సీటు ఎర్ర శేఖర్ కు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే ఖైరతాబాద్ సీటు దాసోజు శ్రవణ్ కు కాకుండా..రేవంత్ బంధువు రోహన్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

నర్సంపేటలో ధోంతి మాధవరెడ్డి బరిలో దిగే ఛాన్స్ ఉంది. నకిరేకల్ లో ప్రీతం, గోషామహల్ లో మెట్టు సాయి కుమార్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. పాలకుర్తి సీటు జంగా రాఘవరెడ్డికి, వరంగల్ వెస్ట్ సీటు నాయిని రాజేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి…మొత్తానికి రేవంత్ టీంకు మాత్రం సీట్లు ముందుగానే ఫిక్స్ అయ్యేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version