అమెరికా అధ్యక్షుడి గా జో బైడెన్ ఎన్నిక అయినా తర్వాత నాటి నుంచి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఎప్పుడు సమావేశం అవుతారు అనే ప్రశ్న ప్రపంచ ప్రజలు వేధిస్తుంది. ఆ సందర్భం త్వరలో వస్తుంది. అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశానికి రంగం సిద్ధం అయింది. సోమవారం రోజున వీరు ఇద్దరూ వర్చువల్ గా సమావేశం కానున్నారు. విడీయో కాల్ ద్వారా ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడు కొన్నారు.
అయితే ఈ సమావేశం పై యావత్ ప్రపంచ ప్రజలు ఆసక్తి ఎదరు చూస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నిక అయిన తర్వాతి నాటి నుంచి రెండు దేశాల మధ్య వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా చాలా వరకు క్షిణించాయి. ఎప్పుడూ ఎదో ఒక అంశం పై ఇరు దేశాల అధ్యక్షులు ఖయ్యానికి కాలు దువ్వు తున్నారు. ఈ మధ్య కాలం లోనే తైవాన్ విషయం లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఇలాంటి పరిస్థితులలో వీరి భేటీ సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటి పై అమెరికా వైట్ హౌస్ స్పందించింది. ఈ భేటీ సాధారణ మైన సమావేశం అని వివరించింది.
ఈ సమావేశం ద్వారా చైనా , అమెరికా మధ్య సంబంధాలు పెంచు కోవడానికి అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పాడు. అమెరికా ఉద్ధేశాలను చైన దృష్టి కి బైడెన్ తీసుకెళ్తాడని తెలిపారు. అలాగే చైనా దేశ వర్గాలు కూడా ఈ సమావేశం గురించి స్పందించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేలా చర్చలు జరుగుతాయని చైన దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సంబంధాల మెరుగు కు అమెరికా సహకరిస్తుందని తాము భావిస్తున్నామని అన్నారు.