బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు… వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసికొచ్చు. ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంక్‌ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్హతల వివరాల లోకి వెళితే.. దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. అదే విధంగా విద్యార్హత తో పాటు కంప్యూటర్‌ కోర్సు లో సర్టిఫికేట్‌ ఉండాలి. అంతే కాకుండా ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌ లో కనీసం ఐదేళ్లు ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి.

వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 25 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే.. అభ్యర్థులు ఆన్‌ లైన్‌ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే..

విద్యార్హతలు, అనుభవం ఆధానంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. ఆ తరవాత పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చెయ్యాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి 07-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version