కాంగ్రెస్‌కు మరో షాక్.. సీనియర్ నేత రాజీనామా..!!

-

కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేశారు. ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. కాగా, లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత సమక్షంలో బుధవారం కపిల్ సిబల్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

కపిల్ సిబల్

కాగా, కపిల్ సిబల్ నామినేషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో కపిల్ సిబల్ రాజ్యసభకు పోటీ చేయనున్నారన్నారు. మొదటి నమోదు ప్రక్రియ పూర్తైందని, రాజ్యసభ సీటుకు మరో ఇద్దరు పేర్లను త్వరలో ప్రకటించనున్నామని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

https://twitter.com/ANINewsUP/status/1529360541973549057?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1529360541973549057%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fnational%2Fkapil-sibal-resigns-congress-party-nominated-to-rajyasabha-from-samajwadi-party-au20-715069.html

Read more RELATED
Recommended to you

Exit mobile version