ప్రస్తుతం రాజకీయాల్లో ప్రతి పార్టీకి అనుకూల మీడియా సంస్థలు ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. అసలు రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు అనుకూలంగా పనిచేయడం టిడిపితోనే మొదలైందని చెప్పొచ్చు. ఈ విషయంలో టిడిపినే ట్రెండ్ సెట్ చేసింది.
ఇక టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా టిడిపికి అనుకూలంగా ఉన్న ఓ మీడియా సంస్థకు వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ ఇంటర్వూ చేసిన పెద్దాయన గురించి అందరికీ తెలిసిందే. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పేరిట ఆ పెద్దాయన ఇంటర్వూ ఏ విధంగా చేశారో కూడా చూశారు. అంటే నేతల మనసులోని మాటలని ఆర్కే అనే పెద్దాయన బయటపెడతారు అనమాట.
తాజాగా షర్మిల మనసులో మాటలు బయటపెట్టే కార్యక్రమం చేశారు. ఈ క్రమంలోనే ఆర్కే…షర్మిల చేత జగన్‌పై బురదజల్లించాలని గట్టిగానే ప్రయత్నించారు. అంతా స్వతహాగా మనది యెల్లో మీడియా కాబట్టి, షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసినా సరే ఏదో రకంగా ఆమె చేత జగన్‌ని నెగిటివ్ చేయించడానికి బాగా ట్రై చేశారు. అంటే జగన్‌తో తనకు విభేదాలు ఉన్నాయని, ఆస్తులు గొడవలు ఉన్నాయని షర్మిల చేత చెప్పించడానికి ట్రై చేశారు.
ఎలాంటి ఇష్యూ లేకపోయినా అలాంటి అంశాలు అడిగి ఆర్కే బాగానే రాజకీయం చేశారు. పైగా జగన్ పాలన చాలా దరిద్రంగా ఉందని ఈయన మాట్లాడుతూ, అదే మాటని షర్మిల చేత చెప్పించాలని చూశారు. కానీ ఎక్కడకక్కడ ఆర్కే మాటలకు తనదైన శైలిలో షర్మిల స్పందించి చెక్ పెట్టేశారు. మొత్తానికి జగన్ పట్ల ఆర్కే హార్ట్ ఎలా ఉందో రివర్స్‌లో తెలిసేలా చేశారు.