అందరినీ రౌండప్ చేస్తున్న షర్మిల..జగన్‌ని కలిపే!

-

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు…ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం వరకే టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న షర్మిల…తాజాగా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నేతలని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి తన అన్న ఏపీ సీఎం జగన్ ని సైతం వదిలిపెట్టడం లేదు..అందరినీ రౌండప్ చేస్తూ…తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిరోజూ ఆమె..కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు.

ఇక తాజాగా గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు…అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆమె..కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరంలో మోటర్లు, పంపులు మునకకు గురయ్యాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె…కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు ప్రయత్నించారు..కానీ పోలీసులు ఆమెని అడ్డుకున్నారు..అలాగే మీడియని కూడా పంపించడం లేదు.

దీంతో కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అవినీతి బయటపడుతుందని మీడియాని కాళేశ్వరం ప్రాజెక్టు లోపలకు అనుమతించడంలో లేదని ఫైర్ అయ్యారు. మేఘా కృష్ణా రెడ్డి 70 వేల కోట్ల అవినీతి పాలడ్డారని, కేసీఆర్, మెగా ఇద్దరూ తోడు దొంగలు అని మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు..మేఘా కృష్ణారెడ్డి…వారికి కూడా దోస్తులే అనే మాట్లాడారు.

అలాగే వరదలకు పోలవరం ఎత్తు పెంచడం కారణమని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పక్క రాష్ట్ర సీఎంని ఇంటికి పిలుస్తారు…స్వీట్లు తినిపించుకుంటారు…భోజనాలు చేస్తారు గాని…ఇరు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై మాట్లాడే తీరిక లేదా? అని ఇటు కేసీఆర్, అటు జగన్ లపై ఫైర్ అయ్యారు. కలిసి భోజనమ చేసినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కనిపించలేదు గాని.. ఇప్పుడు సాకు చెప్పి తప్పించుకోవడానికి మాత్రం పనికొస్తుందని షర్మిల విరుచుకుపడ్డారు. మొత్తానికి షర్మిల…జగన్ టు కలిపి అందరినీ ఒకేసారి రౌండప్ చేసేశారు.

Read more RELATED
Recommended to you

Latest news