మీరు తెలంగాణ పోలీసులా? టీఆర్ఎస్ పోలీసులా? : వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర పోలీసులపై వైఎస్‌ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు తెలంగాణ పోలీసులా ? టీఆర్ఎస్ పోలీసులా ? ప్రజలకు రక్షణ కల్పిస్తున్నరా ? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. టీఆర్ఎస్ కు కొమ్ముకాస్తున్నరా? మాపై దాడి చేసిన వారిని దగ్గరుండి తప్పిస్తారా? మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మా పార్టీని ఏం చేయలేరు. అంతిమ విజయం మాదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల.

KCR అవినీతిపై ఆధారాలున్నాయ‌ని BJP చెప్తున్నా అరెస్టు చేసే స‌త్తా లేదని…అందుకే KCR బరితెగించారని ఫైర్‌అయ్యారు. TRS ప్రోద్బ‌లంతోనే ఇక్క‌డి MLA అవినీతి, అక్ర‌మాలకు పాల్పడుతున్నారు.పోలీసులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారారు.పాద‌యాత్రను ఆపే ద‌మ్ము, ధైర్యం KCRకు లేదని ఎద్దేవా చేశారు షర్మిల. TRS గుండాల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఈ అరాచకానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాకు.. లక్కవరం మహిళల మద్దతు వెల కట్టనిది. మీ అండతోనే ధర్నా విజయవంతం అయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news