నీళ్ల నిరంజన్ రెడ్డి కాదు.. కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి అని మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రైతులు, వ్యవసాయం మీద ప్రేమే లేని మంత్రి నిరంజన్ రెడ్డి.. నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుంటాడట. ఏనాడూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద నోరు విప్పని ఈయన.. నీళ్ల నిరంజన్ రెడ్డి కాదు.. కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదు. రుణమాఫీ చేసిన వైయస్ఆర్ రాక్షసుడట? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్ దేవుడట? సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన వైయస్ఆర్ రాక్షసుడు అట, సంక్షేమాన్ని ఎత్తేసిన కేసీఆర్ దేవుడట అంటూ నిప్పులు చెరిగారు. ఒక మహిళను ఎదుర్కోలేక జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులంతా కట్టకట్టుకుని పిరికిపందల్లా ఫిర్యాదులు ఇస్తున్నారు. దమ్ముంటే మీరు ఇచ్చిన వాగ్దానాలపై బహిరంగ చర్చ పెట్టండి. చర్చించడానికి మేం సిద్ధమని ఛాలెం జ్ చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదు. రుణమాఫీ చేసిన వైయస్ఆర్ రాక్షసుడట? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్ దేవుడట? సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన వైయస్ఆర్ రాక్షసుడు అట, సంక్షేమాన్ని ఎత్తేసిన కేసీఆర్ దేవుడట.#PrajaPrasthanam #Jadcherla pic.twitter.com/uNaCbXCzS5
— YS Sharmila (@realyssharmila) September 17, 2022