షర్మిల రాజకీయం.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

-

షర్మిల గురించి రాజకీయంగా పెద్ద పరిచయం అక్కరలేదు. 2012 ముందు వరకు.. షర్మిల అంటే వైఎస్సార్ తనయురాలు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే జగన్ వైసీపీ పెట్టడం, అలాగే ఆయనకు జైలుకు వెళ్ళడంతో..అన్న పార్టీ కోసం షర్మిల నిలబడ్డారు. 2012 ఉపఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. అలాగే వైసీపీ కోసం పాదయాత్ర చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం ప్రచారం చేశారు. కానీ 2019లో ఏపీలో జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు.

మరి వైసీపీ అధికారంలోకి రావడంతో షర్మిలకు ఏదొక కీలక పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ షర్మిల అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని తిరుగుతున్నారు. అయితే షర్మిల పార్టీ పెట్టిన మొదట్లో..ఆమె ప్రభావం ఎక్కువ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ షర్మిల పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

అసలు ఆమె పార్టీ అంటూ ఒకటి ఉందని ప్రజలు గుర్తించడం లేదు. అలాగే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సైతం షర్మిల పార్టీని పట్టించుకోవడం లేదు. దీంతో షర్మిల పార్టీ హైలైట్ కావడం లేదు. దీంతో ఆమె గుర్తింపు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కేసీఆర్‌పై టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా సరే టీఆర్ఎస్ నేతలు..ఆమెకు పెద్దగా కౌంటర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.

దీంతో షర్మిల విమర్శల దాడి మరింత ఉదృతం చేసింది..ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసింది. అటు వారు కూడా కౌంటర్లు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలని దూషిస్తున్నారని షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అటు షర్మిల కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇదే సమయంలో తాజాగా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రి వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారని, తనని కూడా అలాగే చంపుతారేమో అని, కానీ తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిబద్ధత తెలియదు గాని..ఒక సెంటిమెంట్ లేపి దాని ద్వారా రాజకీయంగా సక్సెస్ అవ్వాలనే కాన్సెప్ట్ కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news