ఆమెకు 16మంది పిల్లలు.. వచ్చే ఏడాది మార్చిలో పుట్టనున్న మరో పాప..!

-

ఓ మహిళ మాతృమూర్తిగా మారడం అనేది తనకి పునర్జన్మలాంటిదే అంటారు. ఈరోజుల్లో ఈ హాడివిడి జీవనశైలి వల్ల పెళ్లైన తర్వాత ఎంతోమంది గర్భందాల్చలేకపోతున్నారు. పిల్లల కోసం ఏవేవో మందులు సైతం వాడుతున్నారు. అలాంటిది ఓ మహిళ ఏకంగా 16 మంది పిల్లలను కనింది. తన జీవితంలో 14 ఏళ్లు గర్భవతిగానే ఉందట..భలే ఆసక్తిగా ఉంది కదూ… త్వరలో పదిహేడో బిడ్డకు కూడా జన్మనివ్వబోతుందట..

ఈ జంట అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తోంది. ఈమె తన జీవితంలో పద్నాలుగేళ్లు గర్భవతిగానే ఉంది. కార్లోస్, ప్యాటీ హెర్నాండేజ్ భార్యభర్తలు… కార్లోస్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. తనకు ఇరవై మంది పిల్లలు ఉండాలని అతని కల… ఇళ్లంతా పిల్లల పరుగులతో నిండిపోవాలని, కళకళలాడిపోవాలని కోరుకనేవాడట.. అతనికి తగ్గట్టే అదే ఆలోచనలతో భార్య కూడా లభించింది. ఆమెకు తన కోరిక చెప్పాడు. అందుకు ఆమె కూడా సరేనంది. అలా వరుస పెట్టి పిల్లల్ని కంటూనే ఉన్నారు. అలా ఇప్పటివరకు 16 మందిని కన్నారు. వారిలో పెద్ద పిల్లాడికి 14 ఏళ్లు కాగా, చిన్నపిల్లకి ఏడాది. ఇప్పుడు ప్యాటీ మళ్లీ గర్భవతి. తన పిల్లలందరికీ దాదాపు సి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెట్టాడు కార్లోస్. ఎందుకంటే అతని తండ్రి పేరు సి అక్షరంతోనే మొదలవుతుంది. అతని గౌరవార్ధం ఇలా పేర్లు పెట్టాడట.. ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఉన్నారు. వీరికి మూడు సార్లు కవలలు పుట్టారు.

పిల్లలో పేర్లు..

కార్లోస్ జూనియర్ (14), క్రిస్టోఫర్ (13), కార్లా (11), కైట్లిన్ (11), క్రిస్టియన్ (10), సెలెస్టే (10), క్రిస్తినా (9), కాల్విన్ (7), కేథరిన్ (7), కరోలిన్ (5), కాలేబ్ (5), కెమిల్లా (4), కరోల్ (4), షార్లెట్ (3), క్రిస్టల్ (2), క్లేటన్ (1).

వచ్చే ఏడాది 17వ పాప..

ప్రస్తుతం ప్యాటీ గర్భవతి. వచ్చే ఏడాది మార్చిలో ఆమెకు పాప పుట్టనుంది. అప్పుడే ఎలా చెప్తారు అంటారేమో.. అమెరికాలో పుట్టబోయేది ఎవరో ముందు తెలుసుకోవడం చట్టబద్దమే.. ఇంతమంది పిల్లలకు తల్లి అయినందుకు సంతోషంగా ఉన్నానని, అది తనకు దక్కిన వరమని అంటోంది..ఫ్యాటీ. తెలిపింది. జీవితంలో 14 ఏళ్లు గర్భవతిగానే జీవించానని, ఆ రోజులు ఎంతో మరువలేనివని చెప్పింది. గత ఏడాది మే నెలలోనే ఈమె చిన్న బిడ్డ క్లేటన్‌కు జన్మనిచ్చింది. తమకు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఉండాలనేది ఆశ అట.. అందుకే మరో ముగ్గురు అబ్బాయిలు పుట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. దేవుడు ఆశీర్వదిస్తే తాము 18వ సారి పిల్లల్ని కనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆ తల్లి సంతోషంగా చెప్తుంది..

ఆసుపత్రిలో తనను స్పెషల్‌గా చూస్తారు. ప్రతి సంవత్సరం ఒకే ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ వైద్యులు, నర్సులు ప్యాటీకి బాగా క్లోస్‌ అయ్యారు. ప్రసవానంతరం వచ్చేముందు.. మళ్లీ వచ్చే ఏడాది కలుద్దాం అని సరదాగా అంటారట.. భలే క్రేజీగా ఉంది కదూ.. ఈరోజుల్లో ఇద్దరు పిల్లలను పెంచడానేకి నానా తంటాలు పడుతున్నారు.. అలాంటిది ఇంత మంది పిల్లలు అంటే గొప్పవిషయమే.!

Read more RELATED
Recommended to you

Latest news