విరాట్, అనుష్కలపై పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

-

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే కోహ్లీ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ప్రముఖ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా విరాట్ ను ప్రశంసల్లో ముంచుతున్నారు. అఫ్గాన్ తో మ్యాచ్ లో శతకం సాధించి దాదాపు మూడేళ్ల నిరీక్షణకు  విరాట్ కోహ్లీ (122*) ముగింపు పలికాడు. ఈ సెంచరీని తన సతీమణి అనుష్క శర్మ, కుమార్తె వామికాలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. క్లిష్టపరిస్థితుల్లో అనుష్క శర్మ అండగా నిలిచిందని అన్నాడు.

తాజాగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా విరాట్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అఫ్గాన్ తో మ్యాచ్ లో  విరాట్ ఇన్నింగ్స్‌ను అభినందించాడు. అంతేకాకుండా విరాట్‌ను ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్’గా.. అనుష్క శర్మను ‘ఐరన్‌ లేడీ’ అంటూ అభివర్ణించాడు.

‘‘విరాట్ కోహ్లీ కంగ్రాట్స్‌. నువ్వు గొప్ప యోధుడివి. వ్యక్తిగతంగా మంచివాడివి. ఇలాగే ముందుకు సాగిపో. నీకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. క్రికెట్ చరిత్రలో నువ్వు తప్పకుండా గుర్తుండిపోతావ్‌. ‘గడ్డు పరిస్థితుల్లో ఆమె మద్దతుగా ఉంది’ అని విరాట్ తన భార్య అనుష్క గురించి చెప్పడం చాలా బాగుంది. హ్యాట్సాఫ్‌ అనుష్క. అద్భుతం చేశావు. మీరు ఐరన్‌ లేడీ.. అలానే విరాట్ మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’’ అని షోయబ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (276)నే టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news