తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వెండితెరపైన రాముడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా రకరకాల పౌరాణిక పాత్రలు పోషించి..తెలుగు వారి ఆరాధ్యుడయ్యారు.
పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు సీనియర్ ఎన్టీఆర్ అన్న రీతిలో ప్రతీ ఒక్కరి భావించే పరిస్థితులను తీసుకొచ్చారు. అయితే, ప్యారలల్ గా ఏఎన్ఆర్ సైతం పౌరాణిక పాత్రలు పోషించారు. కానీ, ఎన్టీఆర్ కు ఉన్న ఆహార్యం వలన ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఓ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఏఎన్‌ఆర్ నటించాల్సి ఉండగా, అన్నపూర్ణమ్మ వలన ఆ స్థానంలో శోభన్ బాబు నటించారు. అందుకు గల కారణాలు తెలుసుకుందాం.
తెలుగు సినిమాకు రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి వెండితెరపైన పలు సినిమాల్లో నటించారు. వీరి మూవీస్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. కాగా ఒకానొక సమయంలో ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వరరావు) సతీమణి అన్నపూర్ణమ్మ ఏఎన్ఆర్ నుంచి ఒక మాట తీసుకుందట. ఇక నుంచి పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్ పక్కన నటించొద్దని అన్నదట.